బ‌రువు త‌గ్గించుకునేందుకు జీఎల్‌పీ-1 మందుల‌ను వాడుతున్నారా..

బరువు తగ్గేందుకు జీఎల్పీ-1 వర్గానికి చెందిన మందులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే కేవలం తక్కువ తినడం వల్ల బరువు తగ్గితే అది ఆరోగ్యకరమైన మార్పు అని భావించడం పొరపాటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని కొవ్వు మాత్రమే కాకుండా కండరాలు కూడా తగ్గిపోతే, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. ఈ మందులు ఆకలిని గణనీయంగా తగ్గిస్తాయి. దీంతో చాలామంది తక్కువ ఆహారం తీసుకుంటూ వేగంగా బరువు తగ్గుతారు. అయితే ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం, క్రమం తప్పకుండా వెయిట్ ట్రైనింగ్ లేదా రెసిస్టెన్స్ వ్యాయామాలు చేయకపోవడం వల్ల శరీరానికి అవసరమైన కండరాల మాస్ కూడా తగ్గిపోతుందని నిపుణులు...