81 ఏళ్ల వృద్ధుడి కాలును కాపాడిన యశోదా వైద్యులు: మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ వైద్యుల ఘనత
వరంగల్, జూలై 18 (సుదీక్ష న్యూస్): మధుమేహం కారణంగా కాలును పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఎదుర్కొన్న 81 ఏళ్ల వృద్ధుడికి అత్యాధునిక వాస్క్యులర్ శస్త్రచికిత్స ద్వారా కాలును కాపాడినట్లు యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన 81 ఏళ్ల కుసుమ భద్రయ్యకు కుడికాలి వేళ్లలో గ్యాంగ్రీన్ ఏర్పడటంతో పాటు కాలికి రక్తప్రసరణ నిలిచిపోయే స్థితి (క్రిటికల్ లింబ్ థ్రెటెనింగ్ ఇస్కీమియా) ఏర్పడిందన్నారు. మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ప్రధాన ధమనిలో తీవ్ర అడ్డంకి ఉన్నట్లు గుర్తించి, అత్యవసరంగా రైట్ ఫెమొరో–పాప్లిటియల్...