గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యార్థి మహ్మద్ ఇర్ఫాన్‌కు ఘన సన్మానం

వరంగల్, జూలై 18 (సుదీక్ష న్యూస్): హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇంటర్నేషనల్ టైక్వాండో అకాడమీ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మెగా అచీవ్‌మెంట్ కార్యక్రమంలో వరంగల్‌కు చెందిన విద్యార్థి మహ్మద్ ఇర్ఫాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొన్న వేలాది మంది క్రీడాకారుల్లో 1,212 మంది మాత్రమే అర్హత సాధించగా, ప్రతి క్రీడాకారుడు 40 నిమిషాల పాటు నిరంతరాయంగా కిక్స్ అండ్ పంచెస్ చేసి తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో కొత్తవాడలోని గోల్డెన్ కిడ్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న...