హెర్నియా సర్జ్–2026 ఘన ప్రారంభం.. దేశవ్యాప్తంగా సర్జన్ల సదస్సు
వరంగల్, జూలై 18 (సుదీక్ష న్యూస్): వరంగల్‌లోని వాసవి హాస్పిటల్ డైరెక్టర్, హెర్నియా సర్జ్–2026 ఆర్గనైజింగ్ చైర్మన్ డా. ఎ. సుధాకర్ సమక్షంలో దేశవ్యాప్త హెర్నియా శస్త్రచికిత్స నిపుణుల మహాసదస్సు “హెర్నియా సర్జ్–2026” శనివారం ఘనంగా ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ సర్జన్లు, వైద్య నిపుణులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా హెర్నియా శస్త్రచికిత్స రంగంలో మినిమల్ యాక్సెస్ సర్జరీ, లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు, అబ్డోమినల్ వాల్ రీకన్‌స్ట్రక్షన్ వంటి ఆధునిక సాంకేతికతలతో విశేష మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ సదస్సు ద్వారా అత్యాధునిక శస్త్రచికిత్స విధానాలు,...