పెట్రోల్ దాడిలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త మృతి
వరంగల్ జిల్లాలో గత రాత్రి పత్తి కుమార్ అనే రౌడీషీటర్ చేసిన పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్త ఆడెపు మహేష్ ఎంజీఎం దవాఖానలో చికిత్స అందిస్తూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్ నగరంలోని 14వ డివిజన్ ఎన్‌టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్, మాజీ డివిజన్ అధ్యక్షుడు అడుప మహేశ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించగా తీవ్ర కాలిన గాయాలయ్యాయి.