ఎల్‌నినో ఎఫెక్ట్.. 10 జిల్లాలకు స్పెషల్ ఐఏఎస్‌లు
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షా భావ పరిస్థితులతోపాటు సీజనల్ పరిస్థితుల పర్యవేక్షణకు 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా వర్షపాతం, తాగునీటి లభ్యత, భూగర్బ జలాలు, వ్యవసాయ పంటల పరిస్థితి, విద్యుత్ సరఫరాపై ఈ అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. జులై 20న వీరంతా జిల్లాల పర్యటనకు వెళ్లాలని ప్రభుత్వం జారీ చేసిన ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక అధికారులు.. మంత్రులు, కలెక్టర్లతోపాటు జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తారు. త్వరలో వీరితో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.