Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

‘ఐసీయూలో కృష్ణారెడ్డికి చికిత్స’.. హెల్త్ బులిటెన్ విడుదల

Author Neti Sudiksha | 21 Jul 2026, 11:51 AM | హైదరాబాద్
‘ఐసీయూలో కృష్ణారెడ్డికి చికిత్స’.. హెల్త్ బులిటెన్ విడుదల

లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు(మంగళవారం) ఉదయం.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్‌ విడుదలైంది. ఐసీయూలో కృష్ణారెడ్డి చికిత్స పొందుతున్నారని.. స్పృహలోనే ఉన్నట్లు జయంతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మాట్లాడగలిగే స్థితిలో ఉన్నట్లు చెప్పారు. ‘మా వైద్య బృందం ఎప్పటికప్పుడు వైటల్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన పరీక్షలు, చికిత్స కొనసాగుతోంది. మల్టీ డిసిప్లినరీ మెడికల్ టీమ్ నిరంతర పర్యవేక్షణ చేస్తోంది’ అని జయంతి ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.