Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

హసీనాను వదలం..

Author Neti Sudiksha | 30 Jul 2026, 09:45 PM | INTERNATIONAL
 హసీనాను వదలం..

స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు బంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరికుల చేసింది. డిసెంబర్‌లో సొంతగడ్డకు వెళ్తానని పేర్కొన్న హసీనాను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని న్యాయశాఖ మంత్రి ఎం అసాదుజ్జమన్(M Asaduzzaman) తెలిపారు. ఆమె దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కోర్టులో లొంగిపోవాలనుకుంటున్న ఆమె ప్రయత్నాలను తిప్పకొడతామని, లొంగుబాటుకు ముందే తనను అదుపులోకి తీసుకుంటామని అసాదుజ్జమన్ వెల్లడించారు.బంగ్లాదేశ్‌లో నిరసనకారులపై హింస కేసులో ఉరి శిక్షకు గురైన మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఊరట లభించేలా లేదు. నిరుడు నవంబర్‌ 25న కోర్టు మరణ శిక్ష విధించిన నేపథ్యంలో.. డిసెంబర్‌లో స్వదేశం వెళ్లాలనుకుంటున్న ఆమెను రాగానే అరెస్ట్ చేయాలని ప్రభత్వం భావిస్తోంది. జూలై 29, బుధవారం అసోసియేటెడ్ ప్రెస్‌(AFP)తో మాట్లాడుతూ తాను కచ్చితంగా స్వదేశం వెళ్తానని అవామీ లీగ్ అధినేత్రి చెప్పారు.