Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్..

Author Neti Sudiksha | 01 Aug 2026, 09:23 PM | ఖమ్మం
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్..

సర్వారం గ్రామపంచాయతీ పరిధిలోని గోప తండా శివారు, రైల్వే ట్రాక్ సమీపంలో పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట స్థావరంపై శనివారం సాయంత్రం సీసీఎస్ (CCS) సిబ్బంది, సుజాతనగర్ పోలీసులు ఉమ్మడిగా దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఈ దాడిలో ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు.
​గోప తండా శివారు, రైల్వే ట్రాక్ సమీపంలో ఆరుగురు పేకాటరాయుళ్లు పట్టుబడగా మరో ఐదుగురు పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ.52,100 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 5 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం (సీజ్) చేసుకున్నామని సుజాతనగర్ ఎస్సై రమాదేవి తెలిపారు. చట్టవ్యతిరేకమైన పేకాట, జూదం
వంటి కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సై రమాదేవి హెచ్చరించారు.