Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య..

Author Neti Sudiksha | 02 Aug 2026, 07:00 PM | NATIONAL
కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య..

ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. ఆ ఇంటి గదిలో ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. (Pune Family Suicide) మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పింప్రి ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న 50 ఏళ్ల వినోద్ పిళ్లై, ఐఐఎం అహ్మదాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఆయన భార్య 45 ఏళ్ల సిర్జా ఒక స్కూల్‌లో కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నది. వారికి 19 ఏళ్ల కుమార్తె పూర్ణిమ ఉన్నది.
కాగా, శనివారం సిర్జా విధులకు హాజరుకాకపోవడం ఆమెను సంప్రదించేందుకు సహోద్యోగులు ప్రయత్నించారు. మొబైల్‌ కాల్స్‌కు స్పందించకపోవడంతో ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు ఆ ఇంటికి వెళ్లి చూడగా వినోద్‌, అతడి భార్య, కుమార్తె అచేతనంగా పడి ఉన్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్‌తో పాటు సోడియం నైట్రేట్ ఉన్న డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్య సహాయం అందకముందే వినోద్‌ మరణించాడు. ఆయన భార్య సిర్జా, కుమార్తె పూర్ణిమకు ఐసీయూలో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొద్దిసేపటికే వారిద్దరు కూడా చనిపోయారు.