Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కృష్ణా, గోదావరి జలాలపై స్పష్టమైన విధానం ఉండాలి

Author Neti Sudiksha | 02 Aug 2026, 09:54 PM | ANDHRA PRADESH
కృష్ణా, గోదావరి జలాలపై స్పష్టమైన విధానం ఉండాలి

గోదావరి, కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ(ఆదివారం) రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమిలో భాగస్వామ్య పార్టీలు వేరైనా, ప్రభుత్వాల బాధ్యత రైతుల ప్రయోజనాలను కాపాడటమేనని ఉద్ఘాటించారు.పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించకపోతే విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండదని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పోలవరం ముంపు పరిధిలోని భూసేకరణ కోసం ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆ రాష్ట్రాలతో సంప్రదింపులు ప్రారంభించాలన్నారు. 'ఒడిశాలో భూసేకరణ కోసం అవసరమైతే 10 నుంచి 15 రెట్లు పరిహారం ఇచ్చినా నష్టం లేదు. ఈ విషయాన్ని నేను స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాను' అని వెల్లడించారు.