Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌ భూషణ్‌కు క్లీన్‌ చిట్‌

Author Neti Sudiksha | 03 Aug 2026, 01:06 PM | Sports
మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌ భూషణ్‌కు క్లీన్‌ చిట్‌

భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ (Wrestling Federation of India, WFI)కు చీఫ్‌గా బ్రిజ్‌ భూషణ్‌ పనిచేశారు. 2023, ఏప్రిల్‌లో ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్‌ భూషణ్‌ తమను లైంగికంగా వేధించాడని కన్నాట్‌ ప్లేస్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు చేపట్టారు. ఏప్రిల్‌ 28న అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అతడిపై రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి లైంగిక వేధింపులు, పరువుకు భంగం కలిగించడం, వెంటపడటంపై ఫిర్యాదు కాగా. రెండోది మైనర్‌ రెజ్లర్‌ ఫిర్యాదు ద్వారా పోక్సో కేసు నమోదయ్యాయి. దీంతో అతడితో పాటు డబ్ల్యూఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌లపై కేసు నమోదు చేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది.