Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

తృణమూల్ కాంగ్రెస్‌కు నేతాజీ బంధువు చంద్ర కుమార్ బోస్ రాజీనామా

Author Neti Sudiksha | 03 Aug 2026, 09:41 PM | NATIONAL
తృణమూల్ కాంగ్రెస్‌కు నేతాజీ బంధువు చంద్ర కుమార్ బోస్ రాజీనామా

పశ్చిమ బెంగాల్ రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనుమడు చంద్రకుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 'వ్యక్తిగత కారణాల వల్ల' పార్టీ వీడుతున్నట్లు వెల్లడిస్తూ సీఎం మమతా బెనర్జీకి ఆయన తన రాజీనామా లేఖను పంపించారు.
ఈ నిర్ణయానికి కొన్ని గంటల ముందు ఆయన సోషల్ మీడియా 'X' వేదికగా రాజకీయ పార్టీల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు. రాజకీయ పార్టీలు చాటుగా ఉండేవారికే ప్రాధాన్యం ఇస్తాయని, నేతాజీ కలలు కనిన సమగ్రమైన బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో నేటి రాజకీయ వ్యవస్థ విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.