Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పాలి.

Author Neti Sudiksha | 03 Aug 2026, 09:47 PM | NATIONAL
జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పాలి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ వీడియోను తాత్కాలికంగా బ్లాక్ చేసిన ఘటన గురించి మెటా ప్రతినిధులు సోమవారం పార్లమెంటరీ స్థాయి కమిటీ ముందు వివరణ ఇచ్చారు. మెటా ఈ ఘటనను సాంకేతిక లోపంగా పేర్కొంటూ క్షమాపణ చెప్పినా, అది మాత్రమే సరిపోదని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా తీసుకునే చర్యలపై వివరాలు కోరినట్లు సమాచారం.పార్లమెంటరీ స్థాయి సమాచార సాంకేతిక కమిటీ ఛైర్మన్ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియోను తొలగించినందుకు మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పాలి' అన్నారు. సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలను, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. తమ ప్లాట్‌ఫామ్‌లలో బాలల లైంగిక వేధింపుల (CSAM) కంటెంట్‌పై కూడా మెటా అధికారులు కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది.