Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

TGSRTC రిక్రూట్‌మెంట్‌.. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల

Author Neti Sudiksha | 03 Aug 2026, 09:51 PM | TELANGANA
TGSRTC రిక్రూట్‌మెంట్‌.. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల

TSRTC డ్రైవర్, శ్రామిక్ పోస్టుల నియామకానికి సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక మండలి (TGPRB) విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు కేటగిరీ వారీగా కట్‌ఆఫ్ మార్కులను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గత ఏడాది సెప్టెంబర్ 17న మొత్తం 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, నియామక ప్రక్రియ అనంతరం 1,604 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు మండలి ప్రకటించింది.
పోస్టుల వారీగా ఎంపికలు
డ్రైవర్ పోస్టులు: 1,000
ఎంపికైన అభ్యర్థులు: 894 మంది
శ్రామిక్ పోస్టులు: 743
ఎంపికైన అభ్యర్థులు: 710 మంది
డ్రైవర్ పోస్టులకు హాజరైన అభ్యర్థులు తమ డ్రైవింగ్ టెస్ట్ మార్కుల వివరాలను వ్యక్తిగత లాగిన్‌లో చూసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఎంపిక జాబితాలతో పాటు అన్ని కేటగిరీలకు సంబంధించిన కట్‌ఆఫ్ మార్కులను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించారు. దీంతో అభ్యర్థులు తమ ఫలితాలను, కట్‌ఆఫ్ వివరాలను సులభంగా పరిశీలించుకోవచ్చు. ప్రవర్తన పరిశీలనతో పాటు వైద్య పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాతే తుది నియామకం ఖరారవుతుంది.