Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

గంజాయి విక్రేతల వివరాలు నేనిస్తా.. అరెస్టు చేయండి

Author Neti Sudiksha | 03 Aug 2026, 09:59 PM | ANDHRA PRADESH
గంజాయి విక్రేతల వివరాలు నేనిస్తా.. అరెస్టు చేయండి

రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై నిర్వహించిన 'సంకల్పం 2.0' కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మూలాలను మట్టుబెట్టడంలో పోలీసులు ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు.విశాఖపట్నం పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల హాస్టళ్లలో రాత్రి వేళల్లో విద్యార్థులు గంజాయి తాగుతున్నారనే విషయాలు తనిఖీల్లో వెల్లడవుతుండటం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు గంజాయి బారిన పడితే వారి భవిష్యత్తు ఏమవుతుందో, వారి కుటుంబాల పరిస్థితి ఏంటో ఆలోచించాలని కోరారు. 'మనందరికీ పిల్లలు ఉన్నారు.. వారి భవిష్యత్తు రక్షణ కోసం పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు' అని పేర్కొన్నారు.