Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు

Author Neti Sudiksha | 04 Aug 2026, 03:42 PM | INTERNATIONAL
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు అని, భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.ప్రపంచ వేదికపై ఇజ్రాయెల్‌కు బలమైన మద్దతు అందిస్తున్న దేశాల్లో భారత్ కీలకమైనదని నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్ ఒంటరిగా ఉందనే ప్రచారం వాస్తవం కాదని నెతన్యాహు స్పష్టం చేశారు. భారత్‌తో పాటు పలు దేశాలతో ఇజ్రాయెల్ దౌత్య, ఆర్థిక, సాంకేతిక, భద్రతా రంగాల్లో సహకారం పెరుగుతోందని చెప్పారు. ఇక, భారత్‌లో ఇజ్రాయెల్‌కు లభిస్తున్న ఆదరణ ఎంతో విలువైనదని ఆయన అన్నారు (Israel India Partnership).