Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

వర్షాకాలం.. ఈ తప్పులు చేస్తే హెయిర్ ఫాల్ పెరుగుతుంది!

Author Neti Sudiksha | 04 Aug 2026, 03:47 PM | HEALTH
వర్షాకాలం.. ఈ తప్పులు చేస్తే హెయిర్ ఫాల్ పెరుగుతుంది!

ఈ రోజుల్లో జుట్టు రాలడం సమస్య మహిళలకే కాదు, పురుషుల్లో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో జుట్టు, తల చర్మానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ఈ సమయంలో కొన్ని తప్పు అలవాట్లు జుట్టు రాలడాన్ని మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఎక్కువసేపు జుట్టుకు నూనె ఉంచుకోవడం వల్ల తల చర్మం జిడ్డుగా మారి, కేశ కుదుళ్లు బలహీనపడే ప్రమాదం ఉంది. దీంతో జుట్టు రాలడం పెరగవచ్చు.
ఆముదం నూనె అందరికీ సరిపోదు
ఇప్పటికే జిడ్డుగా ఉండే తల చర్మం ఉన్నవారు ఆముదం నూనె వాడకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది జుట్టు పెరుగుదల కోసం దీనిని ఉపయోగిస్తుంటారు. కానీ ఇది తల చర్మాన్ని మరింత జిడ్డుగా మార్చి, జుట్టు రాలడానికి దారితీయవచ్చని చెబుతున్నారు.
ఎక్కువగా నూనె రాయొద్దు
జుట్టు త్వరగా పెరగాలని భావించి ఎక్కువ మొత్తంలో నూనె రాయడం మంచిది కాదు. ముఖ్యంగా వర్షాకాలంలో తల చర్మం సహజంగానే తేమగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ నూనె రాస్తే దుమ్ము, మురికి పేరుకుని జుట్టు రాలడం పెరిగే అవకాశం ఉంది.
నూనెను ఎక్కువసేపు ఉంచకూడదు
నూనె రాసుకున్న తర్వాత చాలా మంది ఒకటి, రెండు రోజులు అలాగే ఉంచేస్తారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. నూనెతో తలకు మెల్లగా మసాజ్ చేసి, ఒకటి నుంచి మూడు గంటల తర్వాత తలస్నానం చేయడం మంచిది. ఎక్కువసేపు నూనె ఉంచితే బ్యాక్టీరియా పెరిగి దురద, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు రావచ్చు.
తలకు మెల్లగా మసాజ్ చేయాలి
తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కేశ కుదుళ్లకు ప్రయోజనం కలుగుతుంది. అయితే మరీ బలంగా రుద్దడం వల్ల కేశ కుదుళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి తేలికగా మసాజ్ చేయడం మంచిది.