Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నేల‌పై కూర్చుని భోజ‌నం ఎందుకు చేయాలి..

Author Neti Sudiksha | 05 Aug 2026, 04:56 PM | HEALTH
నేల‌పై కూర్చుని భోజ‌నం ఎందుకు చేయాలి..

భారతీయ సంప్రదాయంలో నేలపై కూర్చొని భోజనం చేయడం ఒక సాధారణ అలవాటు. అయితే ఆధునిక జీవనశైలిలో టేబుల్, కుర్చీలపై కూర్చొని భోజనం చేయడం ఎక్కువైంది. దీంతో నేలపై కూర్చొని తినే పద్ధతి పాతకాలపు ఆచారంగా చాలామంది భావిస్తున్నారు. కానీ ఆయుర్వేదం ప్రకారం నేలపై కూర్చొని భోజనం చేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేసే అలవాటు అని పేర్కొంటోంది. ఆయుర్వేదంలో సూచించే విధంగా నేలపై పద్మాసనం లేదా సుఖాసనం మాదిరిగా కాళ్లు మడిచి కూర్చొని భోజనం చేయడం జీర్ణక్రియకు అనుకూలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ భంగిమలో కూర్చోవడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు సిద్ధమవుతుందని అంటున్నారు. భోజనం చేసే సమయంలో ముందుకు వంగి ఆహారం తీసుకుని మళ్లీ నిటారుగా కూర్చోవడం వల్ల పొత్తికడుపు కండరాలు చురుకుగా పనిచేసి జీర్ణక్రియకు తోడ్పడతాయని ఆయుర్వేదం వివరిస్తోంది.