Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: రాజనాల శ్రీహరి

Author Neti Sudiksha | 05 Aug 2026, 07:18 PM | TELANGANA
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: రాజనాల శ్రీహరి

వరంగల్, ఆగస్టు 5 (సుదీక్ష న్యూస్): దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లోని పేరా–3ను పార్లమెంట్‌లో సవరించి రద్దు చేయాలని కాంగ్రెస్ వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి డిమాండ్ చేశారు.
వరంగల్‌లో డీసీఐవీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దళిత క్రైస్తవ శాంతియుత మహాదీక్షల మూడో రోజు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని, ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఆగస్టు 10న హనుమకొండ అంబేద్కర్ విగ్రహం నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు నిర్వహించే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రి, పలువురు ప్రజాసంఘాల నాయకులు, పాస్టర్లు, చర్చి ప్రతినిధులు పాల్గొన్నారు.