Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

బిల్డింగ్ కట్టాలంటే సిమెంట్, స్టీలే వాడాలా ఏంటి? - ఈ అంగన్​వాడీ 'సమ్​థింగ్​ స్పెషల్'

Author Neti Sudiksha | 07 Aug 2026, 12:00 PM | నారాయణపేట
బిల్డింగ్ కట్టాలంటే సిమెంట్, స్టీలే వాడాలా ఏంటి? - ఈ అంగన్​వాడీ 'సమ్​థింగ్​ స్పెషల్'

నారాయణపేట ;మాములుగా రెండు గదుల ఇల్లు కట్టాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. అది ప్రభుత్వ ప్రాజెక్టు అయితే కనీసం ఏడాదికి పైగా పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నారాయణపేట జిల్లా అధికారులు వినూత్న ఆలోచన చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని కంటైనర్‌లో ఏర్పాటు చేశారు. అత్యంత తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, సకల సౌకర్యాలతో రూపొందిన కంటైనర్ బడి పిల్లలతో పాటు పెద్దలనూ ఆకట్టుకుంటోంది.

అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ప్రగతి పనులు : నారాయణపేట జిల్లా నర్వ మండలం దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద కేంద్రం అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ప్రగతి పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రాంతీయ అసమానతలు తగ్గించి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటారు. నర్వ మండలం యాంకీ గ్రామంలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలుండగా దేనీకి సొంత భవనం లేదు. ఒకటి అద్దె ఇంట్లో కొనసాగుతుండగా, మరోటి ప్రాథమిక పాఠశాలలోని ఓ చిన్న గదిలో నడుస్తోంది. చిన్నారుల కష్టాలు గమనించిన నాటి కలెక్టర్ బోయ శ్రీహర్ష నాలుగేళ్ల క్రితం కంటైనర్‌లో అంగన్‌వాడీ ఏర్పాటుకు యత్నించారు. సుమారు రూ.ఐదు లక్షలు వెచ్చించి తెప్పించినప్పటికీ వివిధ కారణాల వల్ల ప్రారంభించలేకపోయారు.