Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఊరు మొత్తానికి ఒక్క బోరు - ఇంటికో బిందె మంచి నీళ్లు

Author Neti Sudiksha | 07 Aug 2026, 12:16 PM | నాగర్ కర్నూల్
ఊరు మొత్తానికి ఒక్క బోరు - ఇంటికో బిందె మంచి నీళ్లు

నాగర్‌ కర్నూల్ జిల్లా : రాష్ట్రమంతా విద్యుత్‌ వెలుగుల్లో మెరుస్తుంటే, అక్కడ మాత్రం చీకటి రాజ్యమేలుతోంది. తాగు నీరు, విద్యుత్‌, రవాణా వంటి కనీస సౌకర్యాలు లేక ఆదివాసీలు అరిగోస పడుతున్నారు. 60 కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతంలో కుటుంబానికో బిందె చొప్పున మాత్రమే తాగు నీరు దొరుకుతోంది. నాగర్‌ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మల్లాపూర్ పెంట వాసుల దీన పరిస్థితి ఇది.

దినదిన గండంగా జీవనం : చుట్టూ పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి వంటి ప్రాంతాలు పర్యాటకులకు ఆనందాన్నిస్తాయి. కానీ అలాంటి అటవీ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు మాత్రం దినదిన గండంగా గడుస్తోంది. అభివృద్ధికి ఆమడ దూరంలో కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలైన తాగు నీరు, రవాణా, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.