Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

Author Neti Sudiksha | 07 Aug 2026, 04:26 PM | హైదరాబాద్
నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

నేరేడుచర్ల, ఆగస్టు 07 : ప్రభుత్వం పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, డీఏను మంజూరు చేయాలని, విద్యాశాఖలో పర్యవేక్షణ పోస్టులను భర్తీ చేయాలని, రేషనలైజేషన్ జీవో 25 ను సవరించాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నేరేడుచ‌ర్ల‌లో స్థానిక పీఎం శ్రీ జ‌డ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో యుఎస్ పిసి స్టీరింగ్ కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు, టీఎస్ యూటీఎఫ్ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు రషీద్‌ఖాన్, వెంకటేశ్వరరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, నరసింహారావు, రామమూర్తి, బాలు, భికోజీ, మాధవి, అన్నపూర్ణ, నాగమణి, యాదగిరి, శ్రీనివాసరావు, కార్యాలయ సిబ్బంది పద్మ, వినోద్ పాల్గొన్నారు.