Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

లక్ష్మీపురంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నో పార్కింగ్ బోర్డుల ఏర్పాటు

Author Neti Sudiksha | 07 Aug 2026, 04:27 PM | హైదరాబాద్
లక్ష్మీపురంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నో పార్కింగ్ బోర్డుల ఏర్పాటు

బూర్గంపహాడ్, ఆగస్టు 07 : పారిశ్రామిక ప్రాంతమైన బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ప్రధాన ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ మేడా ప్రసాద్ శుక్రవారం నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. లారీ యార్డు ఉండడంతో నిత్యం వందలాది వాహనాలు రోడ్డుకు ఇరువైపులా వెళ్లే ఇతర వాహనాలకు అడ్డంకి మారడంతో వాటిని క్రమబద్ధీకరించేందుకు నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ సమస్య త‌లెత్త‌కుండా ఉండేందుకు నో పార్కింగ్ బోర్డులు 10 వరకు ఏర్పాటు చేశామని, నో పార్కింగ్ బోర్డుల ఏర్పాటుతో ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎస్ఐ నాగభిక్షం ఉన్నారు.