Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

రూ.1.93 కోట్ల విలువైన కల్తీ వంటనూనె సీజ్

Author Neti Sudiksha | 08 Aug 2026, 02:20 PM | NATIONAL
రూ.1.93 కోట్ల విలువైన కల్తీ వంటనూనె సీజ్

మహారాష్ట్రలో వంటనూనెల కల్తీపై ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఉక్కుపాదం మోపింది. బీడ్ జిల్లాలో తాజాగా సోదాలు నిర్వహించి రూ.1.93 కోట్ల విలువైన కల్తీ వంట నూనెను సీజ్ చేసింది. మిలియన్ల లీటర్ల నూనెను స్వాధీనం చేసుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లోగల సంస్థల్లో ఈ రెయిడ్స్ నిర్వహించింది. ఇంతటి స్థాయిలో కల్తీ నూనె వెలుగుచూడటం జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆగస్టు 6,7 తేదీల్లో ఈ రెయిడ్స్ జరిగాయి. మొత్తం 1,18,940 కేజీల కల్తీ నూనెలను స్వాధీనం చేసుకున్నారు. ఒకే నాణ్యత గల నూనెలకు రిఫైన్డ్, అల్ట్రా రిఫైన్డ్ అని రాసున్న ప్యాకెట్లల్లో రీప్యాకేజింగ్ చేసి విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడినట్టు వెలుగులోకి వచ్చింది. పలు సంస్థల్లో అపరిశుభ్రంగా ఉన్న స్టోరేజీ ట్యాంకులు కూడా బయటపడ్డాయి.