Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

లంక బౌలర్లపై విరుచుకుపడ్డ భారత పేసర్ గుర్నూర్!

Author Neti Sudiksha | 08 Aug 2026, 09:13 PM | Sports
లంక బౌలర్లపై విరుచుకుపడ్డ భారత పేసర్ గుర్నూర్!

శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ గుర్నూర్ బ్రార్ అద్భుత బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రధానంగా బౌలరైన గుర్నూర్.. రెండో రోజు ఆట ముగిసే సమయంలో బ్యాటింగ్‌తో సిక్సర్ల తుఫాన్ సృష్టించాడు.రెండో రోజు చివరి ఓవర్‌లో శ్రీలంక స్పిన్నర్ దిలుమ్ సుదీర బౌలింగ్‌కు రాగా.. తొలి బంతికి దేవదత్ పడిక్కల్ సింగిల్ తీసి గుర్నూర్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత సుదీర వేసిన వరుస బంతుల్లో గుర్నూర్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. తర్వాతి బంతికి పడిక్కల్ సింగిల్ తీసే అవకాశం ఉన్నా, తనపై నమ్మకంతో గుర్నూర్ దాన్ని తిరస్కరించాడు