Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

యూపీఐ చెల్లింపులు ఉచితమే..

Author Neti Sudiksha | 08 Aug 2026, 09:29 PM | BUSINESS
యూపీఐ చెల్లింపులు ఉచితమే..

దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (UPI) చెల్లింపులపై వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోమని ఫోన్‌పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలుకు సంబంధించిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంతో, డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారనే ఆందోళన వినియోగదారుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు.
యూపీఐ లావాదేవీలపై భారతీయ వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుమునూ వసూలు చేయబోమని సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. భారతీయ యూజర్లకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని, డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. యూపీఐ వ్యవస్థను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉచితంగానే కొనసాగించడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.