Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నల్లబెల్లికి చేరుకున్న కేసీఆర్‌..

Author Neti Sudiksha | 09 Aug 2026, 04:55 PM | TELANGANA
నల్లబెల్లికి చేరుకున్న కేసీఆర్‌..

దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదివారం నల్లబెల్లికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకున్న అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారుకేసీఆర్‌ నల్లబెల్లికి వస్తున్న సందర్భంగా ఆయనకు దారిపొడవునా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. తమ పార్టీ అధినేత తమకు అండగా ఉన్నారంటూ కార్యకర్తలు అభివాదం చేశారు. పలుచోట్ల కేసీఆర్‌ తన కాన్వాయ్‌ను ఆపి కార్యకర్తలను పలకరించి, ధైర్యం చెప్పారు.