Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

లాల్ దర్వాజా బోనాలు..

Author Neti Sudiksha | 09 Aug 2026, 05:17 PM | హైదరాబాద్
లాల్ దర్వాజా బోనాలు..

హైదరాబాద్ పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా బోనాల బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం 4:30 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణ అనంతరం దేవాలయం తరఫున తొలి బోనం సమర్పించారు. ఉదయం 6:00 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రభుత్వం తరఫున ఉదయం 10:30 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. లాల్ దర్వాజాలోని ప్రధాన ఆలయంతో పాటు పరిసరాల్లోని దాదాపు 3,000 చిన్న దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించనున్నారు.