Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం..

Author Neti Sudiksha | 09 Aug 2026, 05:25 PM | NATIONAL
మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం..

ధార్ జిల్లాలో ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్నావర్-ఉజ్జయిన్ రహదారి పంచకవాస వద్ద ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కారును లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన వాహనాల వద్దకు చేరుకుని క్షతగాత్రుడిని బయటకు తీశారు.అనంతరం బద్నవార్‌లోని సివిల్ ఆస్పత్రికి బాధితుడిని తరలించారు. సమాచారం అందుకున్న బద్నవార్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అమిత్ సింగ్ కుష్వా తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో నుజ్జునుజ్జు అయిన కారు నుంచి అతి కష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. వాటిని బద్నవార్ సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ స్పందించారు. లారీ ప్రమాదవశాత్తూ కారును ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. ఒకరు గాయపడినట్లు వెల్లడించారు.