Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఏపీ పీపీపీ పాలసీ-2026 విడుదల..

Author Neti Sudiksha | 10 Aug 2026, 01:19 PM | ANDHRA PRADESH
ఏపీ పీపీపీ పాలసీ-2026 విడుదల..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర రంగాల్లో పీపీపీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టుల పైప్‌లైన్ ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.2026- 27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్ల స్టేట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)ను ప్రభుత్వం కేటాయించింది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక మూలధన అవసరాలను VGF ద్వారా సర్కార్ భర్తీ చేయనుంది. ప్రాజెక్టుల ప్లానింగ్, అప్రైజల్, ప్రొక్యూర్‌మెంట్, అమలు, పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభ దశలో ఆర్థికంగా లాభదాయకంగా లేని, భవిష్యత్తులో ఆదాయాన్ని సమకూర్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులకు ప్రాజెక్ట్ వయబిలిటీ బ్రిడ్జి ఫండ్ ద్వారా వడ్డీలేని రుణాన్ని అందించే విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది.