Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

గామ‌న్ బ్రిడ్జి స‌మీపంలో యువ‌తి మృతదేహం..

Author Neti Sudiksha | 11 Aug 2026, 11:01 AM | Crime
గామ‌న్ బ్రిడ్జి స‌మీపంలో యువ‌తి మృతదేహం..

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి న‌గ‌ర‌ శివారులో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున తీవ్ర కలకలం రేగింది. కాతేరు పరిధిలోని గామన్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఓ యువతి మృతదేహంతోపాటు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడిని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు యువ‌తి మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు.
తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువ‌కుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో యువకుడిని కోటిలింగాలపేటకు చెందిన అభిలాష్‌గా, యువతిని శాంతినగర్‌ నివాసిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్యనా లేక ఆత్మహత్యాయత్నమా అనే కోణంతో పోలీసులు విచారణ జ‌రుపుతున్నారు.