Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కొలంబియా భూకంపం..

Author Neti Sudiksha | 11 Aug 2026, 11:35 AM | INTERNATIONAL
కొలంబియా భూకంపం..

కొలంబియాలో నిన్న‌ భారీ భూకంపం సంభవించి పెను విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన ఈ శక్తిమంతమైన భూకంపం ధాటికి ఇప్పటివరకు 132 మంది మరణించగా, వందల మంది గాయపడ్డారు. ఈ శతాబ్దంలో దేశంలో ఇదే అత్యంత తీవ్రమైన భూకంపమని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.చోకో డిపార్ట్‌మెంట్‌లోని శాన్ జోస్ డెల్ పల్మార్ సమీపంలో సుమారు 100 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూప్రకంపనల ధాటికి పెరీరా, కాలీ, మణిజాలెస్ వంటి నగరాల్లో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. మణిజాలెస్‌లోని ఓ చర్చి టవర్ కూలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రకంపనలు రాగానే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.