Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

శంషాబాద్ విమానాశ్రయంలో వెండి నాణేలు పట్టివేత

Author Neti Sudiksha | 11 Aug 2026, 01:08 PM | హైదరాబాద్
శంషాబాద్ విమానాశ్రయంలో వెండి నాణేలు పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీగా వెండి నాణేలు పట్టుబడ్డాయి. ఎయిర్‌పోర్టులోని చెకింగ్‌ పాయింట్‌ వద్ద ఓ వ్యక్తిని అనుమానాస్పదంగా గుర్తించిన సీఐఎస్ఎఫ్‌ భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. అతని వద్ద 7 కిలోల వెండి నాణేలు ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ వెళ్లేందుకు వచ్చిన ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. వెండి నాణేలకు సబంధించిన బిల్లులు, పత్రాలపై ఆరా తీస్తున్నారు. వెండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.