Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

‘నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ బెదిరింపు లేఖ‌లు..

Author Neti Sudiksha | 11 Aug 2026, 02:55 PM | Sports
 ‘నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ బెదిరింపు లేఖ‌లు..

భార‌త మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీపోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఇటీవ‌ల తన‌కు త‌ర‌చుగా బెదిరింపు లేఖ‌లు వ‌స్తున్నాయ‌ని, నిందితుల‌ను గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గంగూలీ ఫిర్యాదు చేశాడు. ఈ సంద‌ర్భంగా నిన్నూ, నీ కుటుంబాన్ని చంపేస్తాం అని ఇంగ్లీష్‌లో రాసి ఉన్న లేఖ‌ల‌ను పోలీసుల‌కు స‌మ‌ర్పించాడు దాదా.టీమిండియా దిగ్గ‌జ సార‌థి సౌర‌వ్ గంగూలీకి ఈమ‌ధ్య బెదిరింపు లేఖ‌లు పంపిస్తున్నారు కొంద‌రు దుండ‌గులు. ప్ర‌స్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న దాదాను చంపేస్తాం అంటూ భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌త ఆరు నెల‌లుగా.. నిన్ను చంపేస్తాం. నిన్ను అంతం చేస్తాం. నిన్ను, నీ భార్య డోనా గంగూలీ, కుటుంబాన్ని చంపేస్తాం.. ఇలా గంగూలీని బెదిరించారు అగంత‌కులు. దాంతో, గంగూలీ కుటుంబం, అత‌డి వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు పోలీసుల‌కు ఈ బెదిరింపు లేఖ‌ల‌పై ఫిర్యాదు చేశారు.గ‌త ఆరు నెల‌లుగా గంగూలికి బెదిరింపు లేఖ‌లు వ‌స్తున్నాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘గంగూలీ, అత‌డి కుటుంబానికి వ‌స్తున్న బెదిరింపు లేఖ‌ల‌ను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. గ‌త కొన్ని నెల‌లుగా కొంద‌రు దాదాను భ‌య‌పెట్టాల‌ని లేఖ‌లు పంపుతున్నారు.మొద‌ట్లో వీటిని మేము పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ, లేఖ‌ల తీవ్ర‌త చూశాక.. వారికి గంగూలీ ప‌ట్ల కోపం, అత‌డిని చంపేస్తామ‌ని పేర్కొన‌డంతో అప్ర‌మ‌త్త‌మ‌య్యాం. ఈ లేఖ‌ల్లోని హెచ్చ‌రిక‌ల‌తో మేము భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నాం.