Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

గాయాలు, నొప్పుల‌ను త‌గ్గించే దివ్యౌష‌ధం ప‌సుపు..

Author Neti Sudiksha | 12 Aug 2026, 01:21 PM | HEALTH
గాయాలు, నొప్పుల‌ను త‌గ్గించే దివ్యౌష‌ధం ప‌సుపు..

కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, క్రీడల సమయంలో కలిగే గాయాల వల్ల వచ్చే ఇబ్బందులను తగ్గించేందుకు చాలాకాలంగా పసుపును సహజ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. భారతీయ వంటగదిలో సాధారణంగా కనిపించే ఈ మసాలాకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఔషధ గుణాలు ఉన్నాయని పలు పరిశోధనలు సూచించాయి. తాజాగా వచ్చిన ఓ అధ్యయనం ప్రకారం.. క్రీడల వల్ల కలిగే కొన్ని గాయాల నొప్పిని తగ్గించడంలో పసుపులోని క్రియాశీల పదార్థం కర్కుమిన్‌ ఉపయోగకరంగా ఉంటుంద‌ని వెల్లడైంది. యురోపియన్ రివ్యూ ఫర్ మెడికల్ అండ్ ఫార్మకాలాజికల్ సైన్సెస్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో, పసుపులో ఉండే కర్కుమిన్‌ గాయాల వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడంలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని పరిశోధకులు గుర్తించారు. దాదాపు మూడు వారాల కంటే తక్కువ వ్యవధిలోనే కర్కుమిన్‌ తీసుకున్న రగ్బీ క్రీడాకారుల్లో నొప్పి, అసౌకర్యం తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది. ఈ ప్రభావం పారాసిటమాల్‌, ఐబుప్రోఫెన్‌ వంటి సాధారణ నొప్పి నివారణ మందులతో పోల్చదగినదిగా ఉన్నట్లు వెల్లడించింది.