Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

హైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్స్‌

Author Neti Sudiksha | 12 Aug 2026, 02:16 PM | BUSINESS
హైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్స్‌

హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్లోకి అమెరికాకు చెందిన ట్రంప్‌ ఆర్గనైజేషన్‌.. లగ్జరీ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌తో అడుగుపెట్టింది. భారత్‌లో ట్రంప్‌ బ్రాండ్‌కు అధికారిక ప్రతినిధిగా ఉన్న ట్రెబెకా డెవలపర్స్‌.. హైదరాబాద్‌కు చెందిన ఇరా రియల్టీతో కలిసి ఈ ట్రంప్‌ టవర్స్‌ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. మంగళవారం నాడిక్కడ ట్రెబెకా డెవలపర్స్‌ వ్యవస్థాపకుడు కల్పేష్‌ మెహతా, ఇరా రియల్టీ వ్యవస్థాపకుడు నర్సి రెడ్డి మాట్లాడుతూ.. కోకాపేట్‌ గోల్డెన్‌ మైల్‌ రోడ్‌లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక్కోటి 65 అంతస్థులతో మొత్తం రెండు టవర్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఈ టవర్స్‌లో మొత్తం 16 పెంట్‌హౌస్‌లతో పాటు 450 అపార్ట్‌మెంట్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం భూమి ధరను మినహాయించి రూ.1,700 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు కల్పేష్‌ మెహతా తెలిపారు. భారత్‌లో ఇది ఎనిమిదో ట్రంప్‌ బ్రాండెడ్‌ ప్రాజెక్ట్‌ కాగా.. దక్షిణ భారత్‌లో ఇదే మొదటిదన్నారు. 2014లో ట్రంప్‌ బ్రాండ్‌ భారత మార్కెట్లోకి అడుగుపెట్టగా.. ఇప్పటికే ముంబై, పుణె, గురుగ్రామ్‌, నోయిడా, కోల్‌కతాల్లో ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ఏడాది చివరలో హైదరాబాద్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు ప్రారంభించి నాలుగేళ్లలో ట్రంప్‌ టవర్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెహతా తెలిపారు.