Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

రౌడీషీటర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం!

Author Neti Sudiksha | 12 Aug 2026, 02:20 PM | ANDHRA PRADESH
రౌడీషీటర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం!

కదిరిలో శివ అనే రౌడీషీటర్ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. రౌడీషీటర్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు తీవ్ర నిరసన ఎదురైంది. శివపై అనంతపురం ఎస్సీ, ఎస్టీ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే శివను అదుపులోకి తీసుకునేందుకు కదిరి పోలీసులు ఇంటికి చేరుకున్నారు. అయితే, పోలీసుల రాకను గమనించిన రౌడీ షీటర్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా వారిపై తిరగబడటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాదాపు రెండు గంటల పాటు శివ ఇంటి వద్ద తీవ్ర హైడ్రామా నడిచింది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు రౌడీషీటర్ శివతో పాటు అతని భార్య, తల్లి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.