Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ట్రంప్ దిగిపోయేదాకా యుద్ధం ఆగదు

Author Neti Sudiksha | 13 Aug 2026, 12:11 PM | INTERNATIONAL
ట్రంప్ దిగిపోయేదాకా యుద్ధం ఆగదు

అమెరికాతో జరుగుతున్న యుద్ధాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి వైదొలిగే వరకు ఉద్దేశపూర్వకంగా పొడిగించే అవకాశం ఉందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్ సీనియర్ సలహాదారు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇరాన్‌పై దాడి చేయాలంటే ఎవరైనా భయపడేలా చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.“ఈ యుద్ధాన్ని తదుపరి అధ్యక్ష పదవీకాలం వరకు పొడిగించి, శత్రువుకు నష్టం కలిగించడం ఒక మార్గం. దీనివల్ల ఇరాన్‌పై దాడి చేయాలనుకునే వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుసుకుంటారు” అని ఐఆర్‌జీసీ కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ సలహాదారు మహమ్మద్ రెజా నఖ్దీ ఓ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.