Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

సర్కార్ బడుల పక్కనే కార్పొరేట్ స్కూల్స్..

Author Neti Sudiksha | 20 Jun 2026, 11:26 AM | ఎడ్యుకేషన్, తెలంగాణ
 సర్కార్ బడుల పక్కనే కార్పొరేట్ స్కూల్స్..

| సర్కార్‌ బడులను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్‌ స్కూళ్లకు పట్టం కడుతుండటం విమర్శలకు తావిస్తున్నది. ఇందుకోసం ఆయా సర్కార్‌ స్కూళ్లకు సమీపంలోనే కార్పొరేట్‌ స్కూళ్లకు అనుమతులు ఇవ్వడం ప్ర భుత్వం తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. హైదరాబాద్‌, జూన్‌ 19 (నమస్తే తెలంగాణ): సర్కార్‌ బడులను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్‌ స్కూళ్లకు పట్టం కడుతుండటం విమర్శలకు తావిస్తున్నది. ఇందుకోసం ఆయా సర్కార్‌ స్కూళ్లకు సమీపంలోనే కార్పొరేట్‌ స్కూళ్లకు అనుమతులు ఇవ్వడం ప్ర భుత్వం తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 23వేల సర్కార్‌ బడుల మూసివేతకు రంగం సిద్ధమైందనే వాదనల నేపథ్యంలో సర్కార్‌ పెద్దల వ్యవహారశైలి ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నది. పేదింటి బిడ్డలను చదువులకు దూరం చేసే ప్రయత్నంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.