Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కట్లపాముతో పరాచకాలు..

Author Neti Sudiksha | 20 Jun 2026, 01:06 PM | హైదరాబాద్
కట్లపాముతో పరాచకాలు..

స్నేహితులను భయపెట్టాలని ఓ వ్యక్తి చేసిన పిచ్చి పని అతని ప్రాణాలను బలితీసుకుంది. ఫామ్‌హౌస్‌లో కనిపించిన కట్లపాము పిల్లను చేతిలో తీసుకుని పరచకాలు ఆడటంతో.. అది కాటువేసింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన నవాబ్ జయ్యద్ ఖుమైద్ మొహిద్దీన్ (30) ఒక వ్యాపారవేత్త. తన స్నేహితులతో కలిసి ఇటీవల మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. వారితో సరదాగా గడుపుతున్న సమయంలో అక్కడకు ఒక కట్లపాము పిల్ల వచ్చింది. దాన్ని చూడగానే నవాబ్ దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ పాముతో తన స్నేహితును భయపెట్టాలని అనుకున్నాడు. ఆ కట్ల పాముతో ఆటలు ఆడుతూ స్నేహితులను భయపెట్టబోయాడు. కానీ ఇంతలో కుడి చేతి బొటనవేలుపై కాటేసింది.

చిన్న పాము కదా.. పెద్దగా ప్రమాదం ఉండదని వాబ్ లైట్ తీసుకున్నాడు. స్నేహితుల ముందు నవ్వుకుంటూ.. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, చికిత్స అవసరం లేదని స్నేహితులతో చెప్పుకొచ్చాడు. కానీ చిన్నదైనా, పెద్దదైనా కట్లపాము విషం అత్యంత ప్రమాదకరమేని అతను తెలుసుకోలేకపోయాడు. ఇంకేముంది.. కొద్దిసేపట్లోనే కట్ల పాము విషం నవాబ్ శరీరంపై ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ముందుగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. క్రమంగా ఆరోగ్యం కూడా క్షీణించింది. దీంతో ఆందోళన చెందిన స్నేహితులు నవాబ్‌ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే విషం శరీరం మొత్తం పాకడంతో నవాబ్ కన్నుమూశాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి