Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఎకరానికి రెండు యూరియా బస్తాలు మాత్రమే..!

Author Neti Sudiksha | 07 Jul 2026, 03:41 PM | హైదరాబాద్
 ఎకరానికి రెండు యూరియా బస్తాలు మాత్రమే..!

కాంగ్రెస్‌ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులను ఆదుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. యూరియా సరఫరాలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.Geographic Reference
పాలనలో అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి తీసుకొచ్చిన యూరియా యాప్‌ రైతుల పాలిట శాపంగా మారింది. యాప్‌ ఓపెన్‌ కాకపోవడంతో రైతులు వ్యవసాయాధికారి కార్యాలయాలయాకు పరుగెత్తుతున్నారు. కొత్త అప్డేట్‌ వర్షన్‌ యాప్‌లో అప్డేట్‌ చేసుకున్నప్పటికీ యూరియా బుక్‌ కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీనికి తోడు ఎకరానికి రెండు యూరియా బస్తాలు మాత్రమే బుక్ చేసుకోవాలని నిబంధన పెట్టడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.