Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

తెలంగాణలో అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆమోదం

Author Neti Sudiksha | 22 Jul 2026, 05:11 PM | హైదరాబాద్
 తెలంగాణలో అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆమోదం

హైదరాబాద్, జులై 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా వడ్ల కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న కొనుగోలు లక్ష్యానికి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో రైతులకు పెద్ద ఊరట లభించనుంది.

కేంద్ర ప్రభుత్వం సవరించిన వరి కొనుగోలు అంచనాను బియ్యం రూపంలో 43 లక్షల మెట్రిక్ టన్నులు (LMT)గా నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యానికి మరింత మార్కెట్ భరోసా లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వాహనాల స్థాన నిర్ధారణ వ్యవస్థ (Vehicle Location Tracking System - VLTS) అమలుపై కూడా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026 సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రంలోని అన్ని అర్హత గల వాహనాల్లో వీఎల్టీఎస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వ్యవస్థ ద్వారా వాహనాల కదలికలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించే అవకాశం ఉండటంతో భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి.ఈ అంశాలపై పార్లమెంట్‌లో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలిశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వడ్ల కొనుగోలు అంచనాను పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధరతో కొనుగోలు జరిగేలా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వ్యవసాయ రంగానికి ఊతమివ్వనుంది. అదనపు కొనుగోళ్లతో రైతులకు ఆర్థిక భరోసా పెరగడంతో పాటు రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత సాఫీగా సాగేందుకు అవకాశం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి