Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

యాంటీ బ‌యాటిక్స్ మందుల‌ను వాడుతున్న వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం తప్ప‌నిస‌రి..

Author Neti Sudiksha | 30 Jul 2026, 07:58 PM | HEALTH
యాంటీ బ‌యాటిక్స్ మందుల‌ను వాడుతున్న వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం తప్ప‌నిస‌రి..

యాంటీ బయాటిక్స్‌ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ మందులు తీసుకునే సమయంలో ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. సరైన ఆహారాన్ని తీసుకోకపోతే మందుల ప్రభావం తగ్గడమే కాకుండా విరేచనాలు, జీర్ణాశ‌య అసౌకర్యం వంటి దుష్ప్రభావాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే యాంటీ బయాటిక్స్‌ వాడుతున్నప్పుడు ఏ ఆహారాలు తీసుకోవాలి, వేటిని నివారించాలి అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. యాంటీ బయాటిక్స్ ను వాడే సమయంలో శరీరంలోని మంచి బ్యాక్టీరియా కూడా కొంత మేర దెబ్బతింటుంది. దీంతో విరేచనాలు వంటి సమస్యలు వ‌స్తాయి. ఈ పరిస్థితిలో ప్రోబయోటిక్స్‌ అధికంగా ఉండే పెరుగు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా తిరిగి పెరగడానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ త్వరగా కోలుకోవడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి.
విట‌మిన్ కె తగ్గే చాన్స్‌..
చాలా రోజుల పాటు యాంటీ బయాటిక్స్‌ తీసుకోవాల్సి వస్తే శరీరంలో విటమిన్ కె స్థాయిలు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆకుకూరలు, ఆస్పరాగస్‌, గ్రీన్‌ టీ, బీఫ్‌ లివర్‌ వంటి విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ కె సప్లిమెంట్ల‌ను కూడా తీసుకోవచ్చు. యాంటీ బయాటిక్స్‌ వల్ల కొన్నిసార్లు ఈస్ట్‌ పెరుగుదల ఎక్కువై ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు లేదా జీర్ఱాశ‌య అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాలు కొంత ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఈ మందుల వల్ల విటమిన్ బి స్థాయిలు కూడా తగ్గే అవకాశం ఉండటంతో బ్రోకోలీ వంటి ఆకుపచ్చ కూరగాయలను ఆహారంలో చేర్చడం ప్రయోజనకరం. యాంటీ బయాటిక్స్‌ తీసుకునే సమయంలో కొన్ని ఆహారాలను వీలైనంత వరకు దూరంగా ఉంచడం మంచిది. నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి సిట్రిక్‌ యాసిడ్‌ అధికంగా ఉండే పండ్లు, టమాటో కెచప్‌, చాక్లెట్లు, శీతల పానీయాలు వంటి ఆమ్ల గుణాలు ఉన్న ఆహారాలు మందుల శోషణకు ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది. దీంతో యాంటీ బయాటిక్స్‌ ప్రభావం తగ్గుతుంది.