Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

సముద్ర జలాల్లో చమురు అన్వేషణ కోసం ‘సముద్ర మంథన్’ పథకం..

Author Neti Sudiksha | 31 Jul 2026, 08:36 PM | NATIONAL
 సముద్ర జలాల్లో చమురు అన్వేషణ కోసం ‘సముద్ర మంథన్’ పథకం..

భారత ప్రాదేశిక సముద్ర జలాల్లో చమురు అన్వేషణకు కేంద్రం మరింత ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందుకోసం ‘సముద్ర మంథన్‌’ పేరుతో కొత్త పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. ఈ పథకానికి తాజాగా కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. ‘సముద్ర మంథన్‌’ పథకాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తారు. ఈ పథకం కింద భారత్‌కు హక్కు కలిగిన సముద్ర జలాలు, తీర ప్రాంతాల్లో చమురు అన్వేషణ చేపడతారు.దీని ద్వారా చమురు నిల్వల్ని గుర్తించి, వెలికి తీస్తారు. ఈ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తారు. ఇందుకోసం రూ.84,084 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఇండియాకు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఈఈజడ్) పరిధిలో భారీగా చమురు నిల్వలు ఉన్నాయని అంచనా. ఆయిల్, గ్యాస్ నిల్వలు ఇక్కడ పెద్ద స్థాయిలో ఉన్నాయి. వీటిని నూతన పథకం ద్వారా వెలికి తీస్తారు. చమురు నిల్వల్ని గుర్తించి, వెలికి తీయడం, ఉత్పత్తి దీని ముఖ్య ఉద్దేశం. అలాగే, ప్రత్యేకంగా సంయుక్త చమురు, గ్యాస్ ఉత్పత్తి జోన్లను కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో ఇండియాకు భారీగా మన జలాల నుంచే చమురు లభిస్తుంది. ఫలితంగా చమురు కోసం విదేశాలపై ఆధారపడే అవకాశం తగ్గుతుంది. విదేశాలకు భారత నిధుల్ని వెచ్చించే అవకాశం కూడా తగ్గుతుంది.