Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కార్చిచ్చును ఆర్పుతూ ఒక‌దానికొక‌టి ఢీకొన్న హెలికాప్ట‌ర్‌లు..

Author Neti Sudiksha | 03 Aug 2026, 12:46 PM | INTERNATIONAL
కార్చిచ్చును ఆర్పుతూ ఒక‌దానికొక‌టి ఢీకొన్న హెలికాప్ట‌ర్‌లు..

గ్రీస్ (Greece) లో ఘోరం జ‌రిగింది. అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు (Fire Fighting Helicopters) గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పైలట్లు (Two pilots) ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఏథెన్స్‌ (West Athens) లోని పసాతా తీర ప్రాంతంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
అటికా-బొయోటియా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు గ్రీస్ ఫైర్ సర్వీస్‌కు చెందిన రెండు ‘బెల్’ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంటలను అదుపుచేసే క్రమంలో ఈ రెండు హెలికాప్టర్లు అత్యంత సమీపంలోకి రావడంతో వాటి రోటార్లు (రెక్కలు) ఒకదానికొకటి బలంగా తాకాయి. దాంతో ఒక హెలికాప్టర్ గాలిలోనే పేలిపోయి నేలకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.