Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు అదిరిపోయే ఓపెనింగ్..

Author Neti Sudiksha | 08 Aug 2026, 01:54 PM | Cinema
 వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు అదిరిపోయే ఓపెనింగ్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు గత కొంతకాలంగా సరైన విజయం దక్కలేదు. వరుస సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఆయన అభిమానులు కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కొరియన్ కనకరాజు’ వరుణ్ తేజ్‌కు భారీ ఊరటనిచ్చేలా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితిక నాయక్ హీరోయిన్‌గా నటించింది. సత్య కీలక పాత్రలో కనిపించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది.తాజా సమాచారం ప్రకారం ‘కొరియన్ కనకరాజు’ ప్రీమియర్స్, తొలి రోజు కలిపి రూ.10.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన సినిమాకు ఇది మంచి ఓపెనింగ్‌గా చెప్పొచ్చు. అంతేకాదు.. వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచినట్లు మేకర్స్ వెల్లడించారు. గతంలో వరుణ్ తేజ్‌కు అత్యధిక ఓపెనింగ్ అందించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాను ‘కొరియన్ కనకరాజు’ అధిగమించింది. దీంతో చాలా కాలం తర్వాత వరుణ్ తేజ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ సినిమా మంచి ఆరంభాన్ని అందుకుంది. ముఖ్యంగా అమెరికాలో ఇప్పటివరకు 1.75 లక్షల డాలర్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. సినిమా థియేట్రికల్ రైట్స్‌కు అనుగుణంగా చూస్తే ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.