Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మమతా బెనర్జీ కారుపై రాళ్లతో దాడి..

Author Neti Sudiksha | 09 Aug 2026, 05:15 PM | NATIONAL
మమతా బెనర్జీ కారుపై రాళ్లతో దాడి..

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారుపై దాడి జరిగింది. కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఇటుకలు, రాళ్లతో తన కారుపై దాడి చేశారని, ఈ దాడిలో తృటిలో ప్రాణపాయం తప్పిందని ఆమె తెలియజేశారు. ఈ దాడిని ఆ రాష్ట్ర బీజేపీ ఖండించింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసింది.పోలీసు కస్టడీలో మరణించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ కార్యకర్త ఇంటికి వెళ్తున్న హాలిసహర్‌లో మార్గంలో బెనర్జీ కారుపై ఒక్కసారిగా దాడులు జరిగాయి. నిరసనకారులు తృణమూల్ అధినేత్రి కారును చుట్టుముట్టి, దానిపై బురద పూసి, బూట్లు, నీళ్ల సీసాలు విసిరినట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. అప్రమత్తమైన ఆమె భద్రతా సిబ్బంది ఆమెను సురక్షితంగా అక్కడి తరలించారు.