Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

సాయి సుదర్శన్‌కు గాయం.. రిప్లేస్‌మెంట్‌గా సర్ఫరాజ్ ఖాన్?

Author Neti Sudiksha | 09 Aug 2026, 05:23 PM | Sports
 సాయి సుదర్శన్‌కు గాయం.. రిప్లేస్‌మెంట్‌గా సర్ఫరాజ్ ఖాన్?

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సిరీస్ సమయానికి అతడు ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు లేనట్లు సమాచారం. దీంతో సాయి సుదర్శన్ స్థానంలో మరో స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.సాయి సుదర్శన్‌ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ సాధనలోనూ పాల్గొంటున్నప్పటికీ.. ఆగస్టు 15న గాలే వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టు నాటికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడం కష్టమేనని తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో సర్ఫరాజ్‌ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీలంకకు భారత జట్టు బయలుదేరిన సమయంలో సాయి సుదర్శన్‌ ప్రయాణించలేదు. దీంతో కొలంబోలో శ్రీలంక క్రికెట్‌ XIతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌కు కూడా అతడు దూరమయ్యాడు. మరోవైపు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గురువారం ప్రాక్టీస్‌ సమయంలో కుడి చేతి ఉంగరపు వేలికి గాయం కావడంతో వార్మప్‌ మ్యాచ్‌ తొలి రోజు అతడు ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో కేఎల్‌ రాహుల్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కాగా మూడో రోజు వార్మప్ మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగాడు.