Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కొత్త‌గా ప్ర‌చారం అవుతున్న వాల్యూమెట్రిక్స్ డైట్‌.. ఏంటిది..

Author Neti Sudiksha | 10 Aug 2026, 01:00 PM | HEALTH
కొత్త‌గా ప్ర‌చారం అవుతున్న వాల్యూమెట్రిక్స్ డైట్‌.. ఏంటిది..

బరువు తగ్గాలని చాలామంది డైట్‌ పేరుతో ఆహారాన్ని పూర్తిగా తగ్గించుకోవడం లేదా వింతైన డైట్లను అనుసరించడం చేస్తున్నారు. స్లీపింగ్‌ బ్యూటీ డైట్‌, బేబీ ఫుడ్‌ డైట్‌, ఐస్‌ డైట్‌, సిర్ట్‌ఫుడ్‌ డైట్‌, హోల్‌30 డైట్‌ వంటి వాటి తర్వాత ఇప్పుడు వాల్యూమెట్రిక్స్‌ డైట్‌ కూడా బరువు తగ్గించే విధానంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే మిగతా కొన్ని డైట్లతో పోలిస్తే ఇది తక్కువ కేలరీలు, ఎక్కువ పరిమాణంలో ఉండే ఆహారాలను ఎంచుకోవడంపై దృష్టి పెడుతుంది. వాల్యూమెట్రిక్స్‌ డైట్‌లో తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు లేదా పీచు పదార్థాలు ఉండే ఆహారాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటి ఆహారాలు ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయని ఈ విధానం చెబుతోంది. పండ్లు, కూరగాయలు, సూప్‌లు వంటి సహజంగా తక్కువ కేలరీలు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ఇందులో ముఖ్యమైన అంశం. ఈ డైట్‌ విధానాన్ని పోషకాహార నిపుణురాలు బార్బరా రోల్స్‌ అభివృద్ధి చేశారు. ఇందులో ఏ ఆహారాన్నీ పూర్తిగా నిషేధించరు. అయితే రోజుకు తీసుకోవాల్సిన కేలరీల పరిమితిని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని ఎంచుకోవాలని సూచిస్తారు. అంటే నచ్చిన ఆహారాన్ని పూర్తిగా మానేయడం కంటే, తక్కువ కేలరీలు ఉండే ఆహారాలతో కడుపు నిండేలా చూసుకోవడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం.
నాలుగు గ్రూపులుగా విభ‌జ‌న‌..
వాల్యూమెట్రిక్స్‌ డైట్‌లో ఆహారాలను నాలుగు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో పిండి పదార్థాలు తక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, కొవ్వు లేని పాలు, బ్రోత్‌ ఆధారిత సూప్‌లు ఉంటాయి. రెండో గ్రూపులో పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, బ్రేక్‌ఫాస్ట్‌ సీరియల్స్‌, తక్కువ కొవ్వు మాంసం, పప్పుధాన్యాలు వంటి ఆహారాలు ఉంటాయి. మూడో గ్రూపులో మాంసం, చీజ్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, సలాడ్‌ డ్రెస్సింగ్‌, బ్రెడ్‌, ఐస్‌క్రీమ్‌, కేక్‌ వంటి వాటిని చేర్చారు. నాలుగో గ్రూపులో చిప్స్‌, చాక్లెట్‌ క్యాండీలు, కుకీలు, నట్స్‌, వెన్న, నూనె వంటి అధిక కేలరీలు ఉండే ఆహారాలు ఉంటాయి. ఇందులో మొదటి, రెండో గ్రూపులకు చెందిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. మూడో గ్రూపులోని ఆహారాలను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. నాలుగో గ్రూపులోని ఆహారాలను వీలైనంత వరకు తగ్గించాలి. ఈ విధానంలో ప్రధానంగా తక్కువ కేలరీలున్న ఆహారాలను ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉండి బరువు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఒక అధ్యయనంలో 97 మంది ఊబకాయం ఉన్న మహిళలను రెండు గ్రూపులుగా విభజించి పరిశీలించారు.